ఢిల్లీలో మ‌రోవారం లాక్‌డౌన్

ప్ర‌క‌టించిన సిఎం అర‌వింద్ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో వారం రోజుల‌పాటు లాక్‌డౌన్ పొడిగించారు ఈవిష‌యాన్ని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అదివారం ప్ర‌క‌టించారు. మే 3 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని చెప్పారు. ఢిల్లీలో క‌రోనా ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. నిన్న రికార్డు స్థాయిలో 357 మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని తెలిపారు.

ఢిల్లీలో క‌రోనా విజృంభిస్తుండ‌టంతో ఈ నెల 19వ తేదీ రాత్రి 10 గంట‌ల నుంచి 26వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు వారం రోజుల‌పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విదించిన‌ట్లు కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ విధించక‌పోతే రానున్న రోజుల్లో భ‌యంక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని, క‌రోనా నిబంధ‌న‌ల‌లు పాఠించాల‌ని సూచించారు.

ఆక్సిజ‌న్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, నిర్వ‌హ‌ణ‌కు పోర్ట‌ల్ ప్రారంభించామ‌ని తెలిపారు. త‌యారీదారులు, స‌ర‌ఫ‌రాదారులు, ఆస్ప‌త్రుల‌తో క‌లిసి ఈ పోర్ట‌ల్ ఏర్పాటు చేశామ‌న్నారు.

గ‌డిచిన 24 గంట‌ల‌ల్లో ఢిల్లీలో 24 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క‌రోజులో అత్య‌ధికంగా 357 మంది క‌రోనా రోగులు మ‌ర‌ణించారు.

Leave A Reply

Your email address will not be published.