India Corona: మూడో రోజు 3వేల‌కు పైనే మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ(CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్రం ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరింది. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా బారిన ప‌డి మొత్తం 2,08,330 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. తాజాగా 2,97,540 మంది వైరస్ బారి నుండి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,53,84,418 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 31,70,228 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు వెల్ల‌డించారు.

కొత్తగా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 66,159 కేసులు ఉండగా, కేరళ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్య రికార్డయ్యాయి. ఇక న్యూఢిల్లీలో 24,235 మందికి కరోనా వైరస్‌ సోకింది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21.2 శాతంగా ఉన్నది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.