వైద్యారోగ్యశాఖ బదిలీపై స్పందించిన ఈటల

హైదరాబాద్ (CLiC2NEWS): వైద్య ఆరోగ్యశాఖను తన నుంచి సిఎం కెసిఆర్ కు బదిలీ చేయడంపై ఈటల రాజేందర్ స్పందించారు. మెరుగైన సేవలు అందించేందుకే ఆ శాఖను తన నుంచి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ శాఖని అయిన తీసుకునే అధికారం, తప్పించే అధికారం ముఖ్యమంత్రికి ఉంది అని తెలిపారు. శాఖ లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకి సేవ చేస్తూ తోడుంటానని ఈటల అన్నారు.
ప్రణాళిక ప్రకారమే తనపై కుట్ర జరుగుతుందని ఈటల ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద ఎకరాలు ఆక్రమించి షేడ్లు వేశారని అంటున్నారు. వాస్తవాలన్నీ బయటకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు.
సిఎం కెసిఆర్‌తో ఇప్పటి వరకు మాట్లాడ లేదని, ఇకపై ప్రయత్నం చేయబోనని ఈటల స్పష్టం చేశారు. విచారణ పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని ఈటల స్పష్టం చేశారు.
తప్పకచదవండి:ఈటల నుంచి వైద్యారోగ్యశాఖ సిఎంకు బదిలీ