ఈటల నుంచి వైద్యారోగ్యశాఖ సిఎంకు బదిలీ
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ఆ మోదం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్య శాఖ సిఎం కెసిఆర్‌కు బదిలి అయింది. ఈ మేరకు సిఎం సిఫార్సుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.
మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రైతుల ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో అధికారులు.. ఈటల హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.
అచ్చంపేట, మాసాయిపేటలో మెదక్ కలెక్టర్ హరీష్ విచారణ చేశారు. రైతుల నుంచి వివరాలను సేకరించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని.. క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత సిఎం కెసిఆర్‌కు నివేదిక ఇస్తామని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. ఒవైపు విచారణ జరుగుతుండగానే ఈటల నుంచి వైద్యారోగ్యశాఖను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
[…] ఈటల నుంచి వైద్యారోగ్యశాఖ సిఎంకు బ… […]