TS Corona: 6,876 కొత్త కేసులు.. 59 మ‌ర‌ణాలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,876 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య‌ ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,63,361కు పెరిగింది. కొత్తగా మరో 7,432 మంది కోలుకున్నారని పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 3,81,365 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న క‌రోనా బారిన‌ప‌డి 59 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 2,476 చేరింది. నిన్న 70,961 టెస్టులు చేయగా.. 6,876 కేసులు రికార్డయ్యాయని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,029, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 502, రంగారెడ్డి జిల్లాలో 387 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు

  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,029
  • మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 502
  • ఆదిలాబాద్ జిల్లాలో 113
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో -121
  • జగిత్యాల జిల్లాలో -211
  • కామారెడ్డి – 118
  • కరీంనగర్ – 264
  • ఖమ్మం – 235
  • మహబూబ్‌నగర్ – 229
  • మహబూబాబాద్ – 133
  • మంచిర్యాల – 188
  • నాగర్ కర్నూల్ – 190
  • నల్గొండ – 402
  • నిజామాబాద్ – 218
  • పెద్దపల్లి – 218
  • రాజన్న సిరిసిల్ల – 107
  • రంగారెడ్డి జిల్లాలో – 387
  • సంగారెడ్డి – 157
  • సిద్దిపేట్ – 258
  • సూర్యాపేట్ – 372
  • వికారాబాద్ – 171
  • వనపర్తి – 123
  • వరంగల్ రూరల్ – 109
  • వరంగల్ అర్బన్ – 354
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో – 183 చొప్పున కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Leave A Reply

Your email address will not be published.