India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో మూడో రోజు కూడా కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 3.57 లక్షల కేసులు నమోదయ్యాయని, 3,449 మంది రోగులు మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులుకాస్త తగ్గడం ఊరట కలిగిస్తోందని ఈ శాఖ పేర్కొంది. మహారాష్ట్రలో 48,621, కర్ణాటకలో 44,438, యూపీలో 29,052, కేరళలో 26,011, తమిళనాడులో 20,952 కేసులు నమోదయ్యాయి. ముంబయిలో 24 గంటల్లో 2,624 కేసులు నమోదయ్యాయి. 5 వారాల తరువాత ఒక్క రోజులో ఇది చాలా తగ్గుదల అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
- గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 3,449 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 2,22,408 కి చేరింది.
- దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,02,82,833 కి చేరింది.
- గడిచిన 24 గంటల్లో 3,20,289 మంది కోనాను జయించారు. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,66,13,292 గా ఉంది. ప్రస్తుతం దేశంలో 32,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి.