First Time: Hyderabad జూ లో 8 సింహాల‌కు క‌రోనా

హైదరాబాద్ (CLiC2NEWS): First Time దేశంలో జంతువులు క‌రోనా బారిన ప‌డ్డాయి. హైద‌రాబాద్ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని 8 ఆసియా సింహాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని జూ అధికారులు స్ప‌ష్టం చేశారు. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. 8 సింహాలకు సంబంధించిన కొవిడ్‌ పరీక్షల నివేదికలు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు జూ అధికారులు పేర్కొన్నారు. పా‌ర్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. దీంతో వాటి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారిన ప‌డ్డాయి. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఆదేశాల మేర‌కు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్‌తో అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.