షేక్.బహర్ అలీ: తిప్పతీగ ఎన్ని తిప్పలు తగ్గిస్తుందో తెలుసా..!

తిప్పతీగ. దీని లాటిన్ పేరు టినోస్పోరా కార్డిఫోలియా అంటారు. ఇంగ్లీషులో టినోస్పోర్, సంస్కృతంలో గుడుచి, అమృతవల్లి, తెలుగులో తిప్పతీగ, హిందీలో గిలోవ్ అని అంటారు.
ఇది భారతగదేశంలో ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా తిప్పతీగ చెట్టు పెరుగుతుంది. దీనిని అమృతవల్లి అంటారు. అంటే ఎప్పుడు ఎండిపోకుండా జీవంపోసుకొని ఉంటుంది అందుకే ఇది అమృతంతో సమానం కనుక దీనిని అమృతవల్లి అన్నారు. ఇది తమలపాకు ఆకు లాగానే ఉంటుంది. దీని గింజలు బాటని గింజలు లాగా ఉంటాయి. దీని ఆకు నునుపుగా మృదువుగా ఉంటుంది. కంచలలో,చెట్లకు అనుకోని పెరుగుతుంది. వేప చెట్టుకు తిగలాగా అనుకోని పెరిగితే ఇది సర్వోత్తమైనదిగా చెప్పవచ్చును, తిప్పతీగ లో గిలోయీన్ అనే పేరు గల చేదు పదార్థం గ్లూకోసైడ్. టినోస్పోరిన్, ప్రామారిన్, టినోస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి.
ఇది త్రిదోషాత్మo, ఇది గుండెకు బలాన్ని ఇస్తుంది. రక్తవికారాలు తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, పాండురోగం, మధుమేహం, కామెర్లు, ప్రమేహం, సూక్ష్మ రోగాల నుండి స్థూల రోగాలు తగ్గుస్తుంది. బ్యాక్టీరియా ను శరీరంలో లేకుండా బయటికి తన్ని పంపిస్తుంది. నిద్ర పోతున్న బాక్టీరియను లేపి తన్నుతుంది.
దీనికి ఒక కథ చెపుతాను… దేవతలు,రాక్షసులు సముద్రాన్ని చిలికినవుడు చివరగా వచ్చినది “అమృతం”. ఈ అమృతం దేవతలకు చిక్కగా దానిని రాక్షసులు వారి దగ్గరి నుండి అపహరణ చేసి తీసుకొని పరిగెడుతుంటే ఎక్కడెక్కడ ఈ అమృతం జరిపడిందో అక్కడ ఈ తీగ మొలిచింది. అందుకే దీనిని అమృతవల్లి అంటారు. దీనికి మరణం లేదు.
అలానే మనం వేరే ఊరికి చుట్టాల ఇంటికి పోయినప్పుడు సరిగా అడ్రస్ దొరక్క ఉదయం నుండి సాయంత్రం దాకా తిరిగి అప్పుడు చుట్టాల ఇంటికి పోతే, అప్పుడు చుట్టాలు ఏంది నాయనా ఊరంతా తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చినవా, ఏమైనా “తిప్పతీగ”తొక్కి వచ్చినావా? అలా తిరిగినావు అంటారు.
అదే విధంగా దీనిని ఔషధంగా వాడితే శరీరంలో ఉన్న జబ్బుని తిప్పి తిప్పి బయటికి తన్ని పంపిస్తుంది.
ఇది, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫివర్స్, మరల మరల వచ్చే అన్ని జ్వరాలకు రాకుండా చేస్తుంది. ఒకవేళ వస్తే తగ్గుస్తుంది. వైరస్ వలన వచ్చే వాటిని నిరోధిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు వచ్చే కరోన వైరస్ ని తగ్గిస్తుంది. కరోన వైరస్ రాకుండా చేస్తుంది. బెస్ట్ ఇమ్మ్యూనిటి బూస్టర్ తిప్పతీగ.
దీనిని వాడే విధానం…
4 ఆకులు తీసుకొని రోలులో వేసి మెత్తగా దంచి గుడ్డలో వేసి రసం పిండితే వస్తుంది. ఆ రసం ఉదయం పరిగడుపున 2 టీ స్పూన్స్ తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మధ్యమేహం తగ్గుతుంది. కరోన వైరస్ రాకుండా చక్కగా పనిచేస్తూ వ్యాధి నిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది. విష క్రిములు ఉన్నా.. బాక్టీరియను చంపుతుంది.
దీనిని వాడితే నిత్యం యవ్వనం తో కళకలలాడుతూ ఉంటాం. ముఖం ముడతలు, మొటిమలు, నల్లమచ్చలు, చర్మవ్యాధులు తగ్గుతాయి. రక్తశుద్ధి అవుతుంది.
హెచ్చరిక: దీనిని రెండు టీ స్పూన్స్ కంటే ఎక్కువగా తీసుకున్న, దీని ఆకులు నమిలి తిన్న ఒకొక్కసారి కడుపు ఉబ్బరం వస్తుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు