దేశంలో ఒకేరోజు 90,633 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ విబృంభిస్తున్న‌ది. దీంతో గ‌త వారం రోజులుగా ప్ర‌తిరోజు 80 వేలకు త‌క్కువ‌కాకుండా పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతుంగా, క్ర‌మంగా ఆ సంఖ్య‌ ల‌క్ష‌వైపు ప‌రుగులు తీస్తున్న‌ది. కేవ‌లం 13 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 10 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా నిన్న ఒకేరోజు 90 వేల‌కుపైగా మంది క‌రోనా పాజిటివ్‌లుగా నిర్ధార‌ణ అయ్యాయ‌రు. దీంతో క‌రోనా కేసులు 41 లక్ష‌ల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1065 మంది మృత్యువాతపడగా, మొత్తం 70,626 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 90,633 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1,065 మంది బాధితులు మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఒక్కరోజులో అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. బాధితులు గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టంతో క‌రోనా కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఇందులో 8,62,320 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 31,80,866 మంది పీడితులు క‌రోనా నుంచి కోలుకుని ఇళ్ల‌కు చేరారు.  గ‌త నెల రెండో వారం నుంచి రోజూ 9 వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతుండ‌టంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 70,626కు పెరిగాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. కాగా, క‌రోనా కేసులు ప్ర‌తిరోజు భారీగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ, కోలుకునేవారి సంఖ్య కూడా అంతేమొత్తంలో ఉంటున్న‌ది. నిన్న ఉద‌యం నుంచి ఈ రోజు వ‌ర‌కు 70,072 మంది కోలుకున్నార‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మ‌ర‌ణాల రేటు 1.73 శాతంగా ఉంద‌ని తెలిపింది.  ఇదిలా ఉండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 41 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదైన దేశాల్లో భార‌త్ చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా, బ్రెజిల్‌లో ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 64,31,152 కేసులు న‌మోద‌వ‌గా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 41,23,000 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు 41,13,812కు చేరాయి.

Leave A Reply

Your email address will not be published.