`అనుబంధాల‌కు అద్దం`

స‌మీక్ష‌:“నీ కొడుకు నా కొడుకే.“
చిత్రం: “నీ కొడుకు నా కొడుకే.“
న‌టీన‌టులు: రాధిక, సీత మహా లక్ష్మి, రామ్ మొగులోజి. సుమన్, గణేష్ నడిమెట్ల‌.
కెమెరా: మ‌హేష్ వుట్కూరి
మాట‌లు: రాజ్ ఊర‌గొండ‌
అసిస్టెంట్ ఎడిటర్స్‌: అర‌వింద్ కొంతం
క‌థ‌, స్క్రీన్‌ప్లే,మ్యూజిక్‌, ఎడిటింగ్ ద‌ర్శ‌క‌త్వం: ‌ఆరామ్ మొగిలోజి
స‌హ‌ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: గ‌ణేష్ న‌డిమెట్ల‌
విడుద‌ల తేదీ:
నిడివి: 21 నిముషాలు 39 సెకన్లు

ప్రారంభం లోనే రాధిక ఏడుస్తుంది.. అనారోగ్యం అనుకుంటాం. భర్త వస్తాడు బయట కూర్చునే భార్యను అన్నం పెట్ట మంటాడు.. లోనికి వెళ్లి చూస్తాడు.. ఏదీ వండినట్టు లేదు. ఆమె వధ్దకు వస్తాడు.. వండమని అడుగుతాడు.. ఆమె ఏడుస్తుంది. మళ్ళీ ఏడుపేనా అంటాడు భర్త. ఎందుకంటె పిల్లలు పుట్టలేదని.. ఆ భర్తకు నటన రాదు, ప్రేమ, జాలి తెలుప లేదు.. ఎప్పుడూ ముక్కు పైన కోపమే. మరి కామెడీ కింగ్ ఎలా అయ్యాడో పాపం. సోదరుడికి కొడుకు పుడతాడు..మళ్ళీ రాధికా మానసిక ఒత్తిడికి లోనవుతుంది. సమాజం గొడ్రాలు అనడం సభ్య సమాజానికి సరికాదు.. ఏ లోపం లేదు అని చెప్పిస్తారు రాధికతో.. పిల్లలు లేక పోవడానికి పురుషులే కారణమని చాలా పరిశోధనల్లో తేలింది . ఈ విషయాన్నీ ప్రస్తావిస్తే బాగుండేది.

బ‌లం:
+ రాధిక , సీతా మహా లక్ష్మి న‌ట‌న‌
+డైరెక్ష‌న్‌

బ‌ల‌హీన‌త‌లు
-మాట‌లు

సోదరుడి కొడుకును దత్తత తెచ్చు కుంటారు. ఎనిమిదేళ్ల తరువాత సోదరుడు ఒక పెళ్ళికి వెళతాడు అక్కడ తమ కొడుకు బావిలో పడి చనిపోతాడు దీంతో తమ్ముడికి ఇచ్చిన కొడుకు కావాలంటారు . కానీ తమ్ముడు ఇవ్వడానికి ఇష్టపడడు తోటి కోడలు కూడా వచ్చి అడుగుతుంది.. కానీ ఇవ్వడానికి ఇష్టపడరు. బాబు కూడా అమ్మ అని అనడు. దీంతో ఇద్దరు ఏడుస్తున్న సమయం లో రామ్ వచ్చి అందరూ ఒకే ఇంట్లో ఉంటే సరిపోతుంది అంది సమస్యను పరిష్కారిస్తాడు.. ఇలాంటి కథే 50 ఏళ్ళ క్రితం కనకమ్మ , రంగమ్మ అనే ఇంగ్లీష్ పాఠం 7వ తరగతిలో వుండేది.. ఇది చూస్తే అదే గుర్తొచ్చింది.. ఇక మొత్తం వీడియో ఫిలిం లో రాధిక , సీతా మహా లక్ష్మి నటన చాలా బాగుంది. వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది.

చివ‌ర‌గా: `అనుబంధాల‌కు అద్దం`, పేగు బంధానికి, పెంచిన బంధానికి మ‌ధ్య విక‌సించిన అనుబంధం!
                                                                                                                                                                        –టి . వేదాంత సూరి

గ‌మ‌నిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.