అర్ధరాత్రులే అడ్డా.. రెచ్చిపోతున్న అక్రమార్కులు!
గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న భారీ వాహనాలు.. విసుగుచెంది అడ్డుకున్న గ్రామస్తులు!

మండపేట (CLiC2NEWS): మండపేట నియోజకవర్గంలో పరిధిలోని రూరల్ మండల గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తరలిస్తూ భారీ వాహనాలు అడ్డుఅదుపు లేకుండా తిరుగుతున్నాయి. అధికారులు కోవిడ్ విధుల్లో తలమునకలై ఉండటంతో వీరిని అడ్డుకునేవారే కరువయ్యారు. దీంతో అర్ధరాత్రులే అడ్డాగా చేసుకుని అయా గ్రామాలలో అనధికార లే అవుట్ లలో ఫిల్లింగ్ చేసేందుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ గ్రామస్తులను గురిచేస్తున్నారని తెలిసింది. దీంతో విసుగు చెందిన అర్తమూరు గ్రామస్తులు గురువారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. దీంతో సుమారు ఎనిమిది లారీలను అపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ విధమైన అనుమతులు, పత్రాలు లేకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్ కి పిర్యాదు చేసారు. ఈ మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి లారీలను వెనక్కి పంపివేసినట్లు సమాచారం.