ఆరు రోజులుగా హడలెత్తించిన పెద్దపులి చిక్కింది
కడియం (CLiC2NEWS): తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరించి ప్రజలను హడలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. జిల్లాలోని రాయవరం మండలంలోని కూర్మాపురంలోని ఓ పాడుబడ్డ ఇంటిలో పెద్దపులి ఉన్నట్లు అందిన సమాచారంతో అటవీ సిబ్బంది శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. మత్తు ఇంజక్షన్ లోడ్ చేసిన తుపాకీతో షూట్ చేసేందుకు ప్రయత్నించగా అది సమీప పొలాల్లోకి పారిపోయింది. ఎట్టకేలకు సాయంత్రానికి కొత్త చెరువు వద్ద పులిని అటవీ సిబ్బంది బంధించారు.
ఆరు రోజులుగా పెద్దపులి సంచారంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రఘునాథపురం, రాజానగరం, జి.యర్రపాలెంలో మూడు ఆవులు, దూడను చంపింది. పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరు రోజులుగా అటవీ సిబ్బంది పులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. పుణె, ఢిల్లీనుండి నిపుణుల బృందం సైతం వచ్చింది.
Education News: TG ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
[…] ఆరు రోజులుగా హడలెత్తించిన పెద్దప… […]