AP: లోయలో పడిన బస్సు.. 9 మంది మృతి
చింతూరు (CLiC2NEWS):ఎపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం 35 మంది ఉన్నారు. ఈ ప్రమాదం చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద చోటుచేసుకుంది. బస్సులోని ప్రయాణికులంతా యాత్రికులేనని తెలుస్తోంది. వీరు అన్నవరం నుండి భద్రాచలం వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని.. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
[…] AP: లోయలో పడిన బస్సు 9 మంది మృతి […]