TS Corona: కొత్తగా 4,305 పాజిటివ్ కేసులు

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,416 నమూనాలకు టెస్టులు నిర్వహించగా 4,305 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో తాజాగా 6361 మంది కోలుకోగా, 29 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 2896కి చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5,20,709 మంది కరోనా బారిన పడగా.. 4,62,981 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహచ్ ఎంసీ పరిధిలో 607, మల్కాజ్‌గిరిలో 291, రంగారెడ్డి జిల్లాలో 293, కరీంనగర్ 229, ఖమ్మం 220, నల్గొండ 246, సిద్దిపేట 129, వికారాబాద్ 158 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,39,52,378 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.