TS: ఇవాళ, రేపు వ్యాక్సినేషన్ కు బ్రేక్

హైదరాబాద్ (CLiC2NEWS): కొవిషీల్డ్ మొదటి, రెండో డోస్ మధ్య సమయంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని రేపు, ఎల్లుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌ని రద్దు చేసింది. తిరిగి ఈ నెల 17 నుంచి చేపట్టనున్నట్లు ప్రజారోగ్యశాఖ తెలిపింది. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి మొదటి డోస్ తరువాత 12 వారాలు దాటకే రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కొవిషీల్డ్ టీకా రెండో డోస్‌ను 6-8 వారాల తర్వాత ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో శని, ఆది వారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని నిలిపివేస్తున్నట్టు డిహెచ్ జి శ్రీనివాసరావు తెలిపారు.