బార్క్‌లో 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీ: (CLiC2NEWS): కేంద్ర రక్షణశాఖ పరిధిలోని బార్క్(బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్)లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపికచేయనుంది.
వివరాలు..
- మొత్తం పోస్టులు: 47
- అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఎర్త్‌సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, డైరీ మైక్రోబయాలజీ, జూలజీ, బయోకెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 25
- వెబ్సైట్: http://barc.gov.in/