బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 33 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ (ఏపీఎస్‌) టీచర్‌, ఇతర పోస్టులు అన్ని క‌లిపి మొత్తం 33 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • పోస్టుల వివరాలు

పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు.

  • విభాగాలు

హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్‌ సైన్స్‌ తదితరాలు.

  • పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ)

అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ)

అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

  • ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ)

అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

  • లైబ్రేరియన్‌

అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ(లైబ్రరీ సైన్స్‌)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

  • సెక్యూరిటీ సూపర్‌వైజర్‌

అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యం ఇస్తారు.

  • కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌

అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు.

  • దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌–500087 చిరునామాకు పంపించాలి.  దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021, వెబ్‌సైట్‌: http://www.apsbolarum.edu.in/index.html

Leave A Reply

Your email address will not be published.