CoronaEffect: టిజి సెట్ వాయిదా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా టీజీ సెట్ వాయిదా వేస్తున్నట్లు టీజీసెట్ కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రేపు జరగాల్సిన గురుకులాల ఐదో తరగతి ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ తేదీని తరువాత వెల్లడిస్తామని స్పష్టంచేశారు.