TS LockDown: మరో 10 రోజులు పొడిగింపు

తెలంగాణ మంత్రివ‌ర్గం నిర్ణ‌యం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌ రాష్ట్రంలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగించారు. ఈ మేర‌కు రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఆదివారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధ్య‌క్షత‌న భేటీ అయిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కు మందు తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు లాక్‌డౌన్ గ‌డువు రాష్ట్రంలో నేటితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో భేటీ అయిన కేబినెట్ రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే స‌డ‌లింపు స‌మ‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం 6 నుంచి 10 గంట‌లు వ‌ర‌కే స‌డ‌లింపు ఉండ‌గా.. దాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పొడిగించారు.

Leave A Reply

Your email address will not be published.