Mahesh babu: ఉచిత వ్యాక్సిన్

సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు బుర్రెపాలెం గ్రామ ప్రజలందరికి కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారు. మహేశ్‌బాబు తన స్వగ్రామం అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసినదే. ఆంధ్ర హాస్పిటల్ సహాకారంతో ఈ వాక్సిన్ వేయిస్తున్నారు. మహేష్‌బాబు సహాయానికి ఆ గ్రామ ప్రజలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.