హైద‌రాబాద్ చేరిన 30 ల‌క్ష‌ల డోసులు

హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సిన్ దిగుమ‌తుల‌కు జిఎంఆర్ హైద‌రాబాద్ ఎయిర్ కార్గో (GHAC) వేదికంది. రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు భార‌త్ చేరుకున్నాయి. మంగ‌ళ‌వారం ఉదయం 3.43 గంటలకు వ్యాక్సిన్లు రష్యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్నాయి. మూడో విడ‌తో మ‌రో 27.9 లోల డోసులు దిగుమ‌తి అయ్యాయి.

ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల నుంచి భార‌త్‌కు దిగుమ‌తైన వ్యాక్సిన్లలో ఇదే అతిపెద్దది. ర‌ష్యా నుంచి ప్ర‌త్యేక చార్ట‌ర్డ్ ప్రైట‌ర్ ఆర్‌యు-9450 విమానం వ్యాక్సిన్ల‌ను తీసుకుని ఇవాళ తెల్ల‌వారు జామున 3.43 గంట‌ల ప్రాంతంలో GHAC హైదరాబాద్ కార్గో చేరుకుంది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేక నిర్వహణ అవసర‌మ‌వుతుంది. ఈ వ్యాక్సిన్ల‌ను -20 డిగ్రీల సెంటీగ్రేడ్ల‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. దిగుమ‌తి అయ్యాక వ్యాక్సిన్లు డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌కు త‌ర‌లించారు. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 30 ల‌క్ష‌ల స్పుత్నిక్ వీ డోసులు భార‌త్ చేరుకున్నాయి.
జూన్‌లో మ‌రో 50 లక్ష‌ల డోసుల‌ను పంపిస్తామ‌ని ర‌ష్యా ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.