సోనూనే సూప‌ర్ హీరో: కెటిఆర్‌

హైదరాబాద్​ (CLiC2NEWS): వెండితెర‌మీద విల‌న్‌గా తెలుగువారికి న‌టుడు సోనూసూద్ ప‌రిచ‌యం.. కానీ క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేస్తూ త‌న గొప్ప‌మ‌న‌సును చాటుకున్న రియ‌ల్ హీరో సోనూ సూద్‌. తాజాగా సోనూను తెలంగాణ మంత్రి కెటిఆర్ సైతం సూప‌ర్ హీరో అంటూ కొనియాడాడు.

ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. తాజాగా సాయం అందుకున్న ఓ వ్యక్తి కేటీఆర్​ను ‘సూపర్​హీరో’ అని కొనియాడారు. అడ‌గ్గానే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చి సాయం చేసినందుకు కెటిఆర్‌ను నిజ‌మైన హీరో అంటూ నంద‌కిశోర్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

దీనికి మంత్రి కెటిఆర్ స్పందిస్తూ.. చేసిన ట్విట్ ఇంట‌ర్నెట్‌లో ఆస‌క్తిగా మారింది.

`తాను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధిగా త‌న‌కు చేత‌నైనంతా స‌హాయం చేస్తూ.. బాధ్య‌త‌ను నెర‌వేరుస్తున్నాన‌ని పేర్కొన్నారు… సూప‌ర్ హీరో నేను కాదు… సూప‌ర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిల‌వ‌డం స‌రైన‌ది.. అంటూ మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు.

మంత్రి కెటిఆర్ ట్వీట్‌పై సోనూసూద్ స్పందించారు. కెటిఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. కానీ తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఎంతో చేస్తున్న‌ మీరే నిజ‌మైన హీరో అంటూ.. కెటిఆర్‌ను కొనియాడారు. మీ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌ను నా రెండో ఇల్లుగా నేను భావిస్తున్నాను. అక్క‌డ ప్ర‌జ‌లు త‌న‌పై కొన్ని సంవ‌త్స‌రాల నుంచి నాపై ప్రేమ‌, అభిమానం చూపిస్తున్నారంటూ.. సోనూసూద్ ట్వీట్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.