నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా

హైదరాబాద్ (CLiC2NEWS): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఇవాళటి (శనివారం) నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేసేందుకు శుక్రవారం పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదటిరోజు 3వేల మీదనే దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగనుంది. అయితే వ్యాక్సినేషన్ కోసం వచ్చే విద్యార్థులు పాస్ పోర్ట్, వీసాలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు.