ఎయిర్‌ఫోర్స్‌లోకి 5 రఫెల్ యుద్ధ విమానాలు
చంఢీగర్ : ఫ్రాన్స్ నుండి భారత్‌కు చేరుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను నేడు అధికారికంగా భారత వైమానిక దళం (ఐఎఎఫ్)లో ప్రవేశపెట్టారు.
హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం అయిదు రాఫేల్ యుద్ధ విమానాల ఇండక్షన్ సెర్మనీ జరిగింది. ఈ సందర్భంగా సర్వధర్మ పూజ నిర్వహించారు. సర్వ మతాలకు చెందిన పెద్దలు పూజలు చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వధర్మ పూజ తర్వాత ఎయిర్‌షో నిర్వహించారు. తొలుత రాఫేల్ విమానం చుట్టూ సుఖోయ్-30, జాగ్వార్ విమానాలు గాలిలో ఎగురుతూ వందనం చేశాయి. అత్యద్భుతంగా ఎయిర్ఫో నిర్వహించారు. తేజస్ యుద్ధ విమానాలు కూడా రాఫేల్‌కు స్వాగతం పలికాయి. గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో చేరిన రాఫేల్స్‌కు వాటర్ కెనాన్ సెల్యూట్ కూడా నిర్వహించారు. దీంతో భారత వాయుసేనలో కొత్త అధ్యాయం మొదలైంది. 36 రాఫెల్స్ కోసం 59వేల కోట్ల ఒప్పందం జరిగింది. తొలుత 5 రాఫేల్స్ వచ్చాయి. వచ్చే నెలలో మరో నాలుగు రాఫెల్ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్.భదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ పాల్గొననున్నారు.
తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. ఆ రఫెల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫెల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం బలోపేతమైంది. కాగా, తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
[…] […]