Novavax: 90 % సమర్థవంతం

న్యూయార్క్(CLiC2NEWS): నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా అన్ని రకాల వేరియంట్లపై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ కంపెనీ పేర్కొన్నది. అమెరికా, మెక్సికోలో జరిగిన భారీ అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు నోవావాక్స్ పేర్కొంది. ప్రాథమిక డేటా ఆధారంగా వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతమైందని, సురక్షితంగా కూడా ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ప్రపంచంలో పలు వ్యాక్సిన్ సరఫరా డిమాండ్‌ను అందుకోవడంలో నోవావాక్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆ కంపెనీ చెప్పింది.