AP: డ్రైవర్లకు వాహనమిత్ర ఆర్ధికసాయం…

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి సర్కార్ వాహనమిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు రెండుసార్లు వాహనమిత్ర సాయం అందించింది. కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవర్లకు వాహనమిత్ర ఆర్ధిక సాయం చేస్తున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయబోతున్నారు. ఈ వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్షలమంది ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించబోతున్నారు. మొత్తం రూ.2.48 కోట్ల ఆర్థికసాయం అందించబోతున్నారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక్కటేనని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక సాయం ఎంతో మేలు చేస్తుందని, వాహన బీమాతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్, రిపేర్లకు రూ.10వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనంలో ప్రయాణించే వారికి కూడా భద్రత ఉంటుందని, వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు.