మూడ‌న‌మ్మ‌కాల కోస‌మే కొత్త స‌చివాల‌యం: కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: స‌ర్కార్ కొత్త స‌చివాల‌యం కోసం రూ.400 కోట్ల నుంచి రూ.700 కోట్లకు అంచనాలు పెంచింద‌ని ఎంపి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తట్టామట్టి ఎత్తకముందే దోపిడీకి తెరలేపారని ఎంపి ధ్వజమెత్తారు. కేసీఆర్ మూడనమ్మకాల కోసమే సచివాలయం, గుడి, మసీదు కూల్చివేసారని విమర్శించారు. సీఎం.. సీఎస్, డీజీపీలతో కలిసి ఈ విధ్వంసం చేశారన్నారు. అధికారులను తప్పుడు పద్ధతులకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గుళ్లను కూల్చివేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత మ్యాప్‌లు మాయం చేసి.. కొత్త మ్యాప్‌లతో ఎన్జీటీ బృందాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటీష్ లైబ్రరీలో పాత మ్యాప్‌ ఉందని వెల్లడించారు. కేసీఆర్ ఇస్తున్న దొంగ మ్యాప్‌లు నమ్మొద్దని 1920లో బ్రిటిష్ వారు తయారు చేసిన హైదరాబాద్ మ్యాప్ ఇచ్చినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయానికి అన్ని అనుమతులు వచ్చాయని.. త్వరలోనే సచివాలయం నిర్మాణం చేస్తామని సునీల్ శర్మ ప్రకటించారన్నారు. అంచ‌నాలకు మించి అంచ‌నా వ్య‌యం పెంచి దోపిడీకి తెరలేపారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.