TS: లాక్‌డౌన్ ఎత్తివేత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాల‌ని రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యించింది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య పాజిటివిటీ శాతం గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని, క‌రోనా పూర్తి నియంత్రణ‌లోకి వ‌చ్చింద‌ని, వైద్య శాఖ అధికారులు అందించిన నివేదిక‌ను ప‌రిశీలించిన కేబినెట్ ఈ మేర‌కు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కాగా లాక్‌డౌన్ సంద‌ర్భంగా విధించిన అన్ని ర‌కాల నిబంధ‌ల‌న‌ల‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేయాల‌ని అన్ని శాఖ‌ల అధికారుల‌ను కేబినెట్ ఆదేశించింది. శనివారం మ‌ధ్యాహ్నం స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణ‌యించింది.

కాగా అంత‌ర్రాష్ట్ర ప్ర‌యాణాలు, బ‌స్సు స‌ర్వీసుల విష‌య‌మై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉద‌యం వేళ ప్ర‌యాణాలు కొన‌సాగుతుండ‌గా, తాజా నిర్ణ‌యంతో రాత్రి వేళ కూడా బ‌స్సులు తిర‌గ‌నున్నాయి. అదే విధంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, థియేట‌ర్లు తెరిచే విష‌య‌మై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.