AP EAMCET: జూన్ 24న నోటిఫికేషన్
ఏపీ ఎంసెట్‌కు బదులుగా ఈఏపీసెట్(EAPCET)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. జూన్ 24న నోటిఫికేషన్ విడుదలచేయనున్నామని, జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆగస్టు 19నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. అయితే ఇక ఏపీ ఎంసెట్‌కు బదులుగా ఈఏపీసెట్(EAPCET) నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ పరీక్షకు ఈఏపీసెట్‌ను నిర్వహిస్తారని మంత్రి సురేష్ తెలిపారు.