TS: వరంగల్‌లో కెసిఆర్ పర్యటన
కాళోజీ హెల్త్ వర్సిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

వరంగల్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకస్థలపణ, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. సోమవారం ఉయదం హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో హన్మకొండ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తదితర ప్రముఖులు, ప్రజాప్రతినిదులు స్వాగతం పలికారు.
ముందుగా సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం కేసీఆర్.
అలాగే హన్మకొండలోని వరంగల్ అర్భన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని సిఎం ప్రారంభించనున్నారు.