TS: ఎంసెట్ తేదీలు ఖరారు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించింది.
ఐదు రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో నిర్వహించనున్నారు.
ఎంసెట్ (ఇంజినీరింగ్) పరీక్షను ఆగస్టు 4, 5, 6 తేదీల్లో .. ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రవేశ పరీక్షలు పరీక్షలు జరుగనున్న తేదీలు
- ఎంసెట్, ఇంజినీరింగ్ 4,5,6 ఆగస్టు 2021
- ఎంసెట్- అగ్రికల్చర్, మెడిసిన్ 9, 10 ఆగస్టు 2021
- ఈ సెట్ 3 ఆగస్టు 2021
- పిజిసెట్ 11 నుంచి 14 ఆగస్టు 2021
- ఐసెట్ 19, 20 ఆగస్టు 2021
- లాసెట్ 23 ఆగస్టు 2021
- ఎడ్‌సెట్ 24,25 ఆగస్టు 2021
- పాలీసెట్ 19 జూలై 2021