TS: ఇవాళ 2.09లక్షల రైతుల ఖాతాల్లోకి `రైతుబంధు` సాయం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇవాళ (మంగళవారం) ఈ పథకం కింద 2.09లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.651.07 రైతుబంధు సాయం జమకానుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 59.70లక్షల మంది రైతులకు సాయం అందింది. ఆయా రైతుల ఖాతాల్లో రూ.6,663.79 కోట్లు జమైంది. వానాకాలం సీజన్‌లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం కోటిన్నర ఎకరాలకు ఈ ఏడాది రైతుబంధు లభించనుంది.