డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి

ఆగ్రా (CLiC2NEWS): యుపి రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా సమీపంలో రహంకల యమునా వంతెనపై స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతి వేగంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కరణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిరు. ఘటనలో నలుగురు మృతి చెందారని, ఇద్దరు గాయపడ్డారని తెలిపారు.