ఎపిలో 9,999 కొత్త కేసులు నమోదు

అమరావతి : ఎపిలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,137 నమూనాలను పరీక్షించగా 9,999 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 11,069 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అవ్వడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,46,716కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,779కి చేరింది. ప్రస్తుతం 96,191 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,52,128 నమూనాలను పరీక్షించారు. కొత్తగా నమోదైన వాటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,499 కేసులు నమోదవ్వగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,081, చిత్తూరు జిల్లాలో 1,040 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మ‌ర‌ణించినా వారి వివ‌రాలు
ఇవాళ మరణించిన వారిలో కడప జిల్లాలో 9, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 8 మంది చొప్పున ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 7, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5, తూర్పు గోదావరి జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 1 చొప్పున మరణించారు.

Leave A Reply

Your email address will not be published.