TPCC కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టిపిసిసి) కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. గాంధీభవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీక‌రించారు. అంతకుముందు పండితులు రేవంత్‌ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, సీనియర్‌ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్యయ్య సహా కొత్త కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

బాధ్యత తీసుకున్న రేవంత్ కు భట్టి, శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహ, గీతారెడ్డి, పొన్నాల, నాగం త‌దిత‌ర నేత‌లు శుభాకాంక్షలు చెప్పారు.

కాంగ్రెస్‌కు పునర్వైభవం తేవాలని ఆకాక్షించారు. రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకారోత్సవంతో కాంగ్రెస్‌ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి.

అంతకు ముందు.. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంతంరం నాంప‌ల్లి లోని ద‌ర్గాకు ర్యాలీగా బ‌య‌లుదేరి అక్క‌డ చాద‌ర్ స‌మ‌ర్పించారు. అక్క‌డి నుంచి గాంధీభవన్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి పిసిసి ప‌గ్గాలు చేప‌ట్టారు.

కొత్త టి.పీసీసీ టీమ్‌ కలిసి బాధ్యతల స్వీకారించారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత గాంధీభవన్‌ ఆవరణలో జరిగిన సభలో రేవంత్‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రసంగించారు.

రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీభ‌వ‌న్ చేరుకున్న ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు సంద‌డి చేశారు.

Leave A Reply

Your email address will not be published.