TS: బోనాల ఉత్సవాలకు రూ.15కోట్లు

హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు రూ. 15కోట్లు మంజూరు చేసింది. జూలై 11నుండి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం గోల్కొండ బోనాలు, 25 సికింద్రాబాద్ (లష్కర్) బోనాలు, 26 రంగం కార్యక్రమాలు జరుగుతాయి. గోల్కొండ కోటపైనున్న జగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో మొదటి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, శానిటేషన్, దేవాలయాల వద్ద లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ప్రజలందరూ కొవిడ్ నియమాలు పాటిస్తూ జాతర నిర్వహించుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.