యుఎస్ ఓపెన్ విజేత ఒసాకా

న్యూయార్క్ : అమెరికా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ గెలుచుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో విజేతగా జపాన్ క్రీడాకారిణి నయామి ఒసాకా నిలిచింది. ఏడాది వ్యవధిలో రెండో యుఎస్ ఓపెన్ టైటిల్ ను నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన నయామీ ఒసాకా గెలుచుకోవడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్ లో విక్టోరియా అజరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో ఒసాకా విజయం సాధించింది. తొలి సెట్లో వైఫల్యం చెందినప్పటికీ.. మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తనదైన ఆటతీరుతో సునాయాసంగా టైటిల్‌ను గెలుచుకుంది. 2018లో యుఎస్ ఓపెన్ ను తొలిసారి గెలుచుకున్న ఒసాకా, ఏడాది అనంతరం మరోమారు అదే టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆమెకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి సెట్ ను ఓడిపోయిన తరువాత, రెండో సెట్ లో అజరెంకాకు చుక్కలు చూపించిన ఒసాకా, అదే ఊపుతో మూడవ సెట్ లోనూ తన సత్తా చాటింది.