కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి.. 11 మంది మృతి

ముంబ‌యి (CLiC2NEWS): మహారాష్ట్రలో విషాదం జరిగింది. మ‌హారాష్ట్రలోని చెంబూరులో కొండచరియలు విరిగిపడగా ఓ గోడ కూలి 11 మంది మృతి చెందారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల చెంబూర్ ప్రాంతంలోని భ‌ర‌త్‌న‌గ‌ర్ ప్రాంతంలోని ఇళ్ల‌పై కొండ‌చ‌రియ‌లు విరిగ‌గిప‌డ‌టంతో పై గోడ‌లు కుప్ప‌కూలాయి. ఈ ప్ర‌మాదంలో ఇళ్ల‌లో ఉంటున్న 11 మంది అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గోడ‌కింద చిక్కుకున్న ప‌లువురిని కాపాడారు. ఇప్ప‌టికి 11 మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఒక అధికారులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

 

శిథిలాల‌ను తొల‌గిస్తున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది

 

భ‌ర‌త్‌న‌గ‌ర్ లో కూలిపోయిన ఇళ్లు
మ‌హారాష్ట్రలోని చెంబూర్ ప్రాంతంలోని భ‌ర‌త్‌న‌గ‌ర్ ప్రాంతంలో శిథిలాల‌ను తొల‌గిస్తున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది
Leave A Reply

Your email address will not be published.