రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలు స‌మ‌ర్పించాలి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అనుబంధ శాఖ సంస్థలలోని పోస్టుల వివరాలను రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి ఉప కార్యదర్శి ఆయేషా, పంచాయితీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సంజీవరావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ డిప్యూటి కమిషనర్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ఆయా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం ఎంత మంది అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇంకా ఎంత మందిని భర్తీ చేయాలనే మొదలగు అంశాలను కులంకుశంగా అయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలనుసారంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్ధిక శాఖకు సమర్పించాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.