అనుష్క పోస్టు; కోహ్లీ కామెంట్‌!

ముంబ‌యి: బాలీవుడ్ క‌థానాయిక అనుష్క శ‌ర్మ మ‌రికొన్ని నెల‌ల్లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వబోతున్నారు. తాజాగా అనుష్క ఆమె క‌డుపులో ఉన్న శిశువు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ‌ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో స‌ముద్ర తీరాన నిల్చుని ఉన్న ఆమె గ‌ర్భాన్ని చూసి త‌న్మ‌య‌త్వానికి లోనవుతున్నారు. ఈ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టే బిడ్డ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదు‌రు చూస్తున్నారు.  “ఓ జీవిని సృష్టించ‌డం క‌న్నా అద్భుతం ఇంకేముంటుంది? పైగా అది మ‌న కంట్రోల్‌లో లేన‌పుడు దీన్ని ఇంకేమ‌ని పిలుస్తారు?” అని రాసుకొచ్చారు. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి అమ్మ అని పిలిపించుకోవ‌డం క‌న్నా గొప్ప విష‌యం ఏముంటుంద‌ని ఆమె అమ్మ త‌నాన్ని ఫీల‌వుతున్నారు. ఈ ఫొటోకు విరాట్ స్పందిస్తూ “నా జీవితం అంతా ఒక్క ఫ్రేములో ఉంది” అని కామెంట్ చేశారు. 2017 డిసెంబ‌ర్ 11న ఇట‌లీలో విరాట్ కోహ్లి, అనుష్క ప్రేమ వివాహం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.