ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

హైదరాబాద్ (CLiC2NEWS): లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
“కరోనా మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా నన్ను నమ్మి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు… వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా.. అమ్మకి ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు.. ప్రతి ఒక్కరిని నేను కాచుకుంటా.. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను“ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.