`ధోలవిరా`కు యునెస్కో గుర్తింపు

గాంధీన‌గ‌ర్ (CLiC2NEWS): భారత్‌కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్‌లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. తెలంగాణలోని ములుగు జిల్లాకు చెందిన రామప్ప దేవాలయాన్ని 2020కి గాను ప్రపంచవారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు యునెస్కో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ మేర‌కు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను కూడా చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ధోలవిరా ఉంది. హరప్పా నాగరికత కాలంలో ఈ పట్టణం ప్రసిద్ధి పొందింది. 5వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ అపూర్వ‌మైన‌ నగర జీవనం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. ఇక్క‌డ రాగి, షెల్‌, రాతితో చేసిన విలువైన ఆభరణాలు, టెర్రకోట, బంగారం, దంతాలతో రూపొందించిన అద్భుతమైన కళాఖండాలు ఈ నగరంలో గుర్తించినట్లు తెలిపారు. సింధు నాగకరికత వెల్లివిరిసిన 8 ప్రముఖ ప్రాంతాల్లో ఇది 5వ అతిపెద్దది కావడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.