AP: ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ రద్దు : ఉన్నత విద్యామండలి
అమరావతి (CLiC2NEWS) : ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25% వెయిటేజ్ ఇస్తున్న విషయం తెలిసినదే. అయితే ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలో సాధించిన మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కోవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దయిన కారణంగా ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలలో ప్రవేశాలకు ఇంటర్ వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎంసెట్(EMCET) కు బదులుగా ఈఏపీసెట్(EAPCET)ను ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ పరీక్ష నిర్వహిస్తారన్న విషయంతెలిసినదే.