కరోనా మార్గదర్శకాలు మళ్లీ పొడిగింపు

న్యూఢిల్లీ (CLiC2NEWS):కరోనా మమహమ్మారి క‌ట్ట‌డికోసం కేంద్ర స‌ర్కార్ జారీ చేసిన మార్గదర్శకాల‌ను మరోసారి పొడిగించింది. ఆగ‌స్టు 31 వరకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పొడిగించింది. కాగా కరోనా పాజిటివ్ రేటు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఉదృతి తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది. వరుసగా పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో కరోనా మార్గదర్శకాలు ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

కరోనా నియంత్ర‌ణ కోసం అమ‌లు చేస్తున్న.. ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉండాలని కేంద్రం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.