Tokyo: ఒలింపిక్స్‌లో సెమీస్​లో సింధు..

యమగూచిపై విజయం

టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్​లో భారత స్టార్ షట్లర్​​ పీవీ సింధు దూసుకెళ్తోంది. బ్యాడ్మింటన్​ మహిళల సింగిల్స్​లో విజ‌య దుందుభి మోగిస్తూ సెమీస్​లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో జపాన్​ క్రీడాకారిణి అకానె యమగూచిపై వరుస సెట్లలో విజయం సాధించింది. 21-13, 22-20తో మ్యాచ్​ ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన.. సింధుదే పైచేయి అయింది. ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఈ గెలుపుతో యమగూచిపై గెలుపోటముల రికార్డును 12-7కు పెంచుకుంది.

సింధు య‌మ‌గూచి మ‌ధ్య 56 నిమిషాల పాటు జ‌రిగిన క్వార్ట‌ర్స్ పోరు ఆద్యంతం ఉత్కంట భ‌రితంగా సాగింది. తొలి గేమ్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డిన సింధు.. ఆ త‌ర్వాత మ్యాచ్ నంతా త‌న‌వైపు తిప్పుకుంది. బ్రేక్ త‌ర్వాత య‌మ‌గూచి కాస్త పుంజుకున్న‌ట్లు క‌నిపించినా సింధు ఎదురుదాడి ముందు నిల‌వ‌లేక‌పోయింది. 2016 రియో ఒలింపిక్స్​లో పివి సింధు రజతం సాధించిన విష‌యం తెలిసిందే..

Leave A Reply

Your email address will not be published.