TS: టిఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు తెరాస లో చేరారు. ఆయన ఇటీవల భజాపాకు రాజీనామా చేసిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.