TS: మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు

హైదరాబాద్ (CLiC2NEWS): నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం హామీలను తక్షణం అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వేములపల్లి వద్ద రూ. 9.3 కోట్లతో తోపుచర్ల ఎత్తిపోతల, దామరచర్ల మండలం తుంగపావాగుపై రూ. 32.22 కోట్లతో వీర్లపాలెం రెండో దశ ఎత్తతిపోతల, క్టంగూరు మండలం చెరు అన్నారం వద్ద రూ. 101.62 కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నీటి పారుదల శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది.
గతంలో చేపట్టిన నెల్లికల్లు పనులకను ప్రీక్లోజర్ చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించనుంది. రూ.664.80 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతలకు కొత్తగా నీటిపారుదలశాఖ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.