KCR : రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో తెలంగాణ సిఎం కె.చంద్రశేఖరరావు బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రి గ్రామంలో సిఎం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ సహపంక్తి భోజనం చేసిన సీఎం.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరికొన్ని సార్లు వాసాలమర్రికి వస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.