AP: డప్పు కొట్టి దుమ్మురేపిన రోజా..

పుత్తూరు (CLiC2NEWS): ఎమ్మెల్యే రోజా త‌న నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ..అభిమానులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. మంగళవారం పుత్తూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన.. డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలతో పాటు పంచెను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రోజా డప్పుకొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు. ఎమ్మెల్యే స్వ‌యంగా డ‌ప్పు కొట్ట‌డంతో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఆడి పాడి స్టెప్పులేశారు. తర్వాత రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.