TS: వాసాలమర్రి దళితవాడలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

వాసాలమర్రి (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో బుధవారం పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాసాలమర్రికి చేరుకున్న ముఖ్యమంత్రి అధికారులతో కలిసి దళితవాడలోని ఇంటింటికి తిరుగుతూ పరిశీలించారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చించనున్నారు.
You may update news every half an hour
TQ Sir ..
We will definitely follow your advice.
We strive to deliver fast and clear news